Hyderabad, ఏప్రిల్ 29 -- మహిళలు ఎల్లప్పుడూ మచ్చలేని, కాంతివంతమైన చర్మాన్ని కోరుకుంటారు. కానీ, వేసవి కాలం వచ్చిందంటే చాలు, చర్మ సంబంధిత సమస్యలు పెరుగుతాయి. ఎండ వేడి, దుమ్ము, కాలుష్యం వల్ల చర్మంపై టాన్, మొటిమలు, జిడ్డు వంటి సమస్యలు తీవ్రమవుతాయి. ఈ సీజన్‌లో చర్మాన్ని నిర్లక్ష్యం చేస్తే, చర్మం నిర్జీవంగా మారే ప్రమాదం ఉంది. ప్రకృతి మనకు అందించిన కొన్ని సహజసిద్ధమైన పదార్థాలతో ఈ సమస్యలను అధిగమించవచ్చు. అలాంటి ఒక అద్భుతమైన సహజసిద్ధమైన పదార్థమే మామిడి ఆకులు.

వేసవిలో ఎంతో ఇష్టంగా తినే మామిడి పండుతో పాటు, దాని ఆకులు కూడా చర్మానికి అనేక విధాలుగా మేలు చేస్తాయి. మామిడి ఆకుల్లో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని శుభ్రంగా ఉంచడానికి, మచ్చలను తగ్గించడానికి, చర్మ ఛాయను మెరుగుపరచడానికి సహాయపడతాయి. మరి లేటు ఎందుకు పెరట్...