భారతదేశం, జనవరి 14 -- సంక్రాంతి పండుగను వరుసగా మూడు రోజులు పాటు జరుపుకుంటాము. సంక్రాంతి ముందు రోజు భోగి, సంక్రాంతి తర్వాత రోజు కనుమ పండుగలను జరుపుకుంటాము. పురాణాల ప్రకారం, సంక్రాంతి పండుగ నాడు చేసే దానాలకు ఎంతో విశిష్టత ఉంది. సంక్రాంతి నాడు దానం చేస్తే చాలా పుణ్యం కలుగుతుంది. అలాగే మన రాశి ప్రకారం సంక్రాంతి నాడు కొన్ని దానాలు చేయడం వలన దోషాలన్నీ తొలగిపోతాయి, ఆనందంగా ఉండొచ్చు. మరి సంక్రాంతి నాడు వేటిని దానం చేస్తే మంచిది? ఏ రాశి వారు ఏమి దానం చేయడం వలన పుణ్యం కలుగుతుంది? ఇప్పుడు తెలుసుకుందాం.

మేష రాశి వారు మకర సంక్రాంతి నాడు బెల్లాన్ని దానం చేయడం వలన విశేష ఫలితాన్ని పొందవచ్చు. ఈ రాశి వారు బెల్లాన్ని దానం చేయడం వలన జాతకంలో ఏమైనా దోషాలు ఉంటే తొలగిపోతాయి.

వృషభ రాశి వారు అద్భుతమైన ఫలితాలు పొందాలన్నా, కష్టాలు తొలగిపోవాలన్నా, దోషాలు తొలగిపోవాల...