భారతదేశం, జనవరి 10 -- హిందూ సంప్రదాయంలో మకర సంక్రాంతికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. సాధారణంగా మనం జరుపుకునే చాలా పండుగలు చంద్రుడి గమనాన్ని బట్టి మారుతుంటాయి (చాంద్రమానం). కానీ, సంక్రాంతి మాత్రం సూర్యుడి గమనం ఆధారంగా (సౌరమానం) జరుపుకునే పండుగ. సూర్యుడు ధనుస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించే పవిత్ర ఘడియలనే మనం 'మకర సంక్రాంతి'గా జరుపుకుంటాం.

అయితే, ప్రతి ఏడాది లాగే ఈసారి కూడా పండుగ తేదీ విషయంలో ప్రజల్లో కొంత గందరగోళం నెలకొంది. పండుగ 14వ తేదీనా లేక 15వ తేదీనా? అనే సందేహాలకు సమాధానం ఇక్కడ ఉంది.

దృక్ పంచాంగం, జ్యోతిష్య పండితుల విశ్లేషణ ప్రకారం.. 2026లో మకర సంక్రాంతిని జనవరి 14న జరుపుకోవడమే సరైనది.

సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే సమయాన్ని 'సంక్రాంతి క్షణం' అంటారు. ఈ ఏడాది జనవరి 14, బుధవారం మధ్యాహ్నం 3:13 గంటలకు సూర్యుడు మకర రాశిలోకి ప్రవ...