భారతదేశం, జనవరి 12 -- మకర సంక్రాంతి పండుగ కేవలం పతంగుల సందడినే కాదు, ఆకాశంలో ఒక అద్భుతమైన గ్రహ గమనాన్ని కూడా తీసుకురాబోతోంది. జ్యోతిష్య శాస్త్ర లెక్కల ప్రకారం, 2026 జనవరి 14న మకర సంక్రాంతి పర్వదినం అత్యంత విశేషమైనదిగా మారనుంది. దీనికి ప్రధాన కారణం ఆ రోజు ఏర్పడనున్న 'బుధాదిత్య రాజయోగం'.

సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే ఈ శుభ ఘడియల్లోనే బుధుడు కూడా అదే రాశిలో కొలువుదీరనున్నాడు. ఈ ఇద్దరు గ్రహాల కలయిక వల్ల కొన్ని రాశుల వారి జాతకాలు ఒక్కసారిగా మారిపోనున్నాయి.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యుడు, బుధుడు ఒకే రాశిలో కలిసినప్పుడు బుధాదిత్య రాజయోగం ఏర్పడుతుంది. "సూర్యుడు ఆత్మవిశ్వాసానికి, అధికారానికి, కీర్తి ప్రతిష్టలకు ప్రతీక కాగా.. బుధుడు తెలివితేటలు, వాక్చాతుర్యం, వ్యాపారం, సరైన నిర్ణయాలు తీసుకునే శక్తికి కారకుడు. వీరిద్దరూ కలిస్తే ఆ వ్యక్తి మ...