భారతదేశం, ఏప్రిల్ 21 -- ఈ నెల 23న బుధావం హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. హైదరాబాద్, సికింద్రాబాద్‌లోని వైన్స్ షాపులు ఈ నెల 21వ తేదీ సాయంత్రం 4 గంటల నుంచి బుధవారం సాయంత్రం 6 గంటల వరకు మూసివేయాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు.

ఆదేశాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. వైన్ షాపు అనుమతులు రద్దు చేస్తామని ఇప్పటికే హైదరాబాద్ సీపీతో పాటు ఎక్సైజ్ శాఖ అధికారులు ప్రకటించారు. ఎవరైనా పరిమితికి మించి స్టాక్ ఉంచి.. ఏదైనా వేరే ప్రదేశంలో విక్రయించినా నేరంగానే పరిగణిస్తామని పోలీసులు స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలని చెప్పారు.

హైదరాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి మొత్తం 4 నామినేషన్లు దాఖలయ్యాయి. ఎంఐఎం అభ్యర్థిగా మీర్జా రియాజ...