Hyderabad, జూలై 13 -- పూర్వకాలంలో కొన్ని యుగాల క్రితం మందపల్లి గ్రామ ప్రాంతమంతా దండకారణ్యంగా ఉండేది. ఆ ప్రాంతంలో మహర్షులు యజ్ఞయాగాదులు చేసుకొంటూ ఉండేవారు. అయితే అశ్వత్థుడు, పిప్పలుడు అను ఇద్దరు రాక్షసులు దేవలోకంలో కూడా ప్రసిద్ధి చెందిన వారైవున్నారు. వారిరువురిలో అశ్వత్థుడు రావిచెట్టు రూపంలోను, పిప్పలుడు బ్రాహ్మణ రూపంలోను వుండి సమయం చూసి యజ్ఞయాగాదులను నాశనం చేస్తూ, అక్కడకు వచ్చిన బ్రాహ్మణులను తినివేయసాగారు.

రోజు రోజుకూ బ్రాహ్మణులు క్షీణించుటను చూసి, వృద్ధులైన మహర్షులు గౌతమీ దక్షిణ తటమున తపస్సు చేస్తున్న సూర్యపుత్రుడగు 'శని'ని చూసి, ఘోరమైన ఈ రాక్షస కృత్యాలను నిరోధించి ఆ ఇద్దరు రాక్షసులను వధించమని కోరారు అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

అప్పుడు శని, "నా తపస్సు కాగానే ఆ రాక్షసులను ...