భారతదేశం, నవంబర్ 13 -- మంత్రి కొండా సురేఖ, హీరో నాగార్జున మధ్య నడుస్తున్న కేసుకు తెరపడింది. తాజాగా మంత్రి కొండా సురేఖ క్షమాపణలు చెబుతూ. ప్రకటన విడుదల చేయటంతో హీరో అక్కినేని నాగార్జున కీలక నిర్ణయం తీసుకున్నారు. కోర్టులో వేసిన క్రిమినల్‌ దావాను హీరో నాగార్జున వెనక్కి తీసుకున్నారు.

ఫిర్యాదుదారుడుగా ఉన్న హీరో నాగార్జున. సెక్షన్ 280 BNSS కింద కేసును ఉపసంహరించుకుంటున్నట్లు కోర్టుకు తెలియజేశారు. ఈ పిటిషన్ ను అనుమతించిన కోర్టు. 13-11-2025వ తేదీన కేసును కొట్టివేస్తూ కేసును ముగించింది. ఫలితంగా ఈ వ్యవహారంలో మంత్రి కొండా సురేఖకు ఉపశమనం దొరికినట్లు అయింది.

మంత్రి కొండా సురేఖ మంగళవారం రాత్రి తర్వాత ట్విట్టర్ వేదికగా ఓ ప్రకటన చేశారు. హీరో నాగార్జున కుటుంబంపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు ట్విట్ చేశారు. తాను చేసిన వ్యాఖ్యలపై పశ్చాత్తాపం వ్య...