భారతదేశం, అక్టోబర్ 30 -- తెలంగాణ కేబినెట్ విస్తరణకు ముహుర్తం ఫిక్స్ అయింది. ఇందులో భాగంగా మాజీ క్రికెటర్ మహమ్మద్‌ అజారుద్దీన్‌ కు చోటు ఖరారైంది. ఈ మేరకు ప్రమాణస్వీకారానికి సంబంధించిన ఏర్పాట్లును ప్రభుత్వం సిద్ధం చేస్తోంది.

శుక్రవారం (అక్టోబర్ 31) మధ్యాహ్నం 12.15 నిమిషాలకు రాజ్ భవన్‌లో కేబినెట్ విస్తరణ ఉంటుంది. కొత్త మంత్రిగా అజారుద్దీన్‌ ప్రమాణస్వీకారం చేస్తారు. ఇప్పటికే ఆయనతో పాటు సంబంధిత అధికారులకు సమాచారం అందించారు. ప్రమాణ స్వీకారానికి సీటింగ్, తదితర అంశాలపై కూడా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

ప్రస్తుత కేబినెట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సహా 15 మంది సభ్యులు ఉన్నారు. నిబంధనల ప్రకారం మంత్రివర్గంలో మరో ముగ్గురు సభ్యులకు ఇంకా అవకాశం ఉంది. అజారుద్దీన్ ప్రమాణస్వీకారం చేస్తే మరో రెండింటిని భర్తీ చేయాల్సి ఉంటుంది. ఇప్పటివరకు కేబినెట్ ల...