భారతదేశం, మే 13 -- తెలుగు రొమాంటిక్ కామెడీ మూవీ 'సింగిల్' స్ట్రాంగ్ పాజిటివ్ టాక్‍తో దుమ్మురేపుతోంది. శ్రీవిష్ణు హీరోగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్‍బస్టర్ దిశగా సాగుతోంది. మే 9న విడుదలైన ఈ సినిమా అంచనాలకు మించి కలెక్షన్లను రాబడుతోంది. ఈ మూవీకి కార్తీక్ రాజు దర్శకత్వం వహించారు. ఫుల్ ఫన్‍తో ఎంటర్‌టైనింగ్‍గా ఉండటంతో ఈ సినిమా ప్రేక్షకులను మెప్పిస్తోంది. సోమవారం కూడా సింగిల్ సత్తాచాటింది.

సింగిల్ సినిమా తొలి మూడు రోజుల్లో మంచి జోరు చూపింది. దీంతో వీకెండ్ తర్వాత సోమవారం జోరు కొనసాగిస్తుందా అనే ఉత్కంఠ నెలకొంది. అయితే, ఈ చిత్రం సోమవారం పరీక్షను పాసైపోయింది. ఈ చిత్రం నాలుగు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.19.01 కోట్లను దక్కించుకుంది. సోమవారమైన నాలుగో రోజు ఈ సినిమాకు సుమారు రూ.3కోట్ల కలెక్షన్లు వచ్చాయి.

వీకెండ్ తర్వాత ఫస్ట్ మండే సింగిల్ ...