భారతదేశం, మే 20 -- హాలీవుడ్ లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ 'మిషన్ ఇంపాజిబుల్ ది ఫైనల్ రెకనింగ్' మూవీ కలెక్షన్లపై మండే ఎఫెక్ట్ పడింది. మూవీ రిలీజైన మూడో రోజు వసూళ్లు తగ్గాయి. వీకెండ్ జోష్ తో ఉన్న ఈ టామ్ క్రూజ్ మూవీ ఫస్ట్ మండే రోజు ఊహించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోయింది. మే 19న మిషన్ ఇంపాజిబుల్ 8 మూవీ సాధించిన వసూళ్లు ఇలా ఉన్నాయి.

మిషన్ ఇంపాజిబుల్ ది ఫైనల్ రెకనింగ్ మూవీ మూడో రోజు రూ.6.75 కోట్ల నెట్ కలెక్షన్లు రాబట్టినట్లు సక్నిల్క్ పేర్కొంది. మే 19వ తేదీన కలెక్షన్లు తగ్గినట్లు తెలిపింది. దీంతో మే 17న రిలీజైన టామ్ క్రూజ్ లేటెస్ట్ మూవీ కలెక్షన్లు మూడు రోజుల్లో రూ.40.25 కోట్లకు చేరాయి.

వీక్ డే కావడంతో సోమవారం మిషన్ ఇంపాజిబుల్ 8 సినిమాకు కలెక్షన్లు తగ్గాయి. మే 19న ఓవరాల్ ఆక్యుపెన్సీ 15.65 శాతంగా నమోదైందని సక్కిల్న్ వెల్లడించింది. మార్నింగ్ షోక...