భారతదేశం, జనవరి 5 -- శాసనమండలిలో కల్వకుంట్ల కవిత కంటతడి పెట్టుకున్నారు. ఇదే తన చివరి ప్రసంగం అని భావోద్వేగానికి గురయ్యారు. ఒక వ్యక్తిగా బయటకు వెళ్తున్నానని చెప్పి.. బలమైన శక్తిగా మళ్లీ చట్ట సభల్లోకి వస్తానని శపథం చేశారు. తన రాజీనామాను ఆమోదించాలని మండలి ఛైర్మన్‌కు విజ్ఞప్తి చేశారు.

మండలిలో కవిత మాట్లాడుతూ భావోద్వేగానిగి గురయ్యారు. ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పాటు అయిన తర్వాత 2014లో జాగృతి ఆధ్వర్యంలో బతుకమ్మ నిర్వహించామన్నారు కవిత. అప్పటి నుంచి ఇక తనపై ఆంక్షలు మెుదలైనట్టుగా తెలిపారు. వ్యక్తి స్వే్చ్ఛను ఎలా హరిస్తారనే బాధ, ఆవేదనతో ఈ మాటలు మాట్లాడుతున్నట్టుగా చెప్పారు.

బీఆర్ఎస్‌లో తనకు ఏ బాధ్యత ఇచ్చినా మనస్ఫూర్తిగా పనిచేసినట్టుగా కవిత గుర్తుచేసుకున్నారు. పార్టీలో ప్రశ్నిస్తే.. తనపై కక్షగట్టారన్నారు. అక్కడ అంతర్గత ప్రజాస్వామ్యం లేకుంటే.. ...