భారతదేశం, జూన్ 10 -- ఢిల్లీలోని ద్వారకా సెక్టార్ 13లోని షాబాద్ అపార్ట్మెంట్ పై అంతస్తులో మంగళవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా మంటలు చుట్టుముట్టడంతో ప్రమాదం నుంచి తప్పించుకునేందుకు ఓ వ్యక్తి, అతని ఇద్దరు పిల్లలు భవనం పై నుంచి కిందకు దూకడంతో తీవ్ర గాయాల పాలై మృతి చెందారు.
ఉదయం 10 గంటల సమయంలో ఎంఆర్వీ స్కూల్ సమీపంలోని సెక్టార్ 13లోని షాబాద్ అపార్ట్మెంట్ పై అంతస్తు మొత్తాన్ని మంటలు చుట్టుముట్టాయి. ఆ అపార్ట్మెంట్లోని నివాసితులు భయాందోళనలకు గురయ్యారు. వారిలో ఒక వ్యక్తి, ఇద్దరు కుమారులు ప్రాణాలు కాపాడుకునేందుకు ఆ భవనం పై నుంచి దూకారు. కానీ, తమ ప్రాణాలను కాపాడుకోలేకపోయారు. పై నుంచి దూకడంతో తీవ్ర గాయాలపాలై మృతి చెందారు. వారి వయస్సు, ఇతర వివరాలు వెంటనే అందుబాటులో లేవు. అగ్నిప్రమాదానికి గల కారణాలు కూడా వెంటనే తెలియరాలేదు.
ఉదయం 10...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.