భారతదేశం, డిసెంబర్ 18 -- టాలీవుడ్ హీరోగా సూపర్ క్రేజ్ సాధించిన శివాజీ సెకండ్ ఇన్నింగ్స్‌లో బిగ్ బాస్‌తో మంచి పాపులారిటీ సంపాదించుకున్నాడు. బిగ్ బాస్ తెలుగు 7తో బుల్లితెర ఆడియెన్స్‌ను అలరించి వరుస సినిమా ఆఫర్స్‌తో దూసుకుపోతున్నాడు. కోర్ట్ మూవీలో మంగపతిగా అలరించిన శివాజీ నటించిన లేటెస్ట్ మూవీ దండోరా.

సామాజిక అసమానతలపై తెరకెక్కిన దండోరా సినిమాకు మురళీకాంత్ దర్శకత్వం వహించారు. శివాజీతోపాటు నవదీప్, నందు, బిందు మాధవి, రవికృష్ణ, మౌనికా రెడ్డి తదితరులు కీలక పాత్రలు పోషించిన దండోరా డిసెంబర్ 25న థియేట్రికల్ రిలీజ్ కానుంది.

ఈ నేపథ్యంలో దండోరా సినిమా ప్రమోషన్స్ జోరుగా చేస్తున్నారు. ఈ క్రమంలోనే మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో దండోరా మూవీకి సంబంధించి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలిపారు శివాజీ.

-ముందుగా 'దండోరా' కథను విన్నాను. ఇందులో నా పాత్ర చాలా కొత్తగా ఉంట...