భారతదేశం, అక్టోబర్ 8 -- మంచు మోహన్ బాబుకు చెందిన యూనివర్సిటీకి పెద్ద షాక్ తగిలింది. మోహన్ బాబు యూనివర్సిటీకి భారీగా జరిమానా వేసింది ఏపీ రాష్ట్ర ఉన్నత విద్యా కమిషన్. విద్యార్థుల నుంచి ఎక్కువ ఫీజులు వసూలు చేయడమే కాకుండా.. ఆదాయాన్ని వెల్లడించకపోవడం, విద్యార్థుల హాజరు నిర్వహణలో అవకతవకలు, ఒరిజనల్ సర్టిఫికేట్లను నిలిపివేయడంలాంటి ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఉన్నత విద్యా కమిషన్ రూ.15 లక్షల జరిమానా విధించింది. అయితే ఈ మెుత్తాన్ని యూనివర్సిటీ చెల్లించింది.

2022-23 నుంచి అంటే గత మూడేళ్ల నుంచి విద్యార్థుల దగ్గర ఫీజులు అదనంగా వసూలు చేశారని ఆరోపణలు వచ్చాయి. ఇవి రూ.26 కోట్లపైన ఉన్నట్టుగా తేల్చారు. ఈ మేరకు యూనివర్సిటీపై విచారణ చేసిన ఉన్నత విద్యా కమిషన్ నిజమేనని నిర్ధారించింది. విద్యార్థుల నుంచి అదనంగా వసూలు చేసిన రూ.26,17,52,872 కూడా తిరిగి చెల్లించాలని కమిష...