Hyderabad, సెప్టెంబర్ 15 -- మంచు లక్ష్మీ ప్రసన్న మెయిన్ లీడ్ రూల్‌లో మంచు మోహన్ బాబు కీలక పాత్రలో నటించిన సినిమా దక్ష ది డెడ్‌లీ కాన్సిపిరసీ. తండ్రీకూతుళ్లు మొదటిసారిగా కలిసి నటించిన దక్ష సినిమాకు డైరెక్టర్ వంశీ కృష్ణ కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం వహించారు. శ్రీలక్ష్మి ప్రసన్న పిక్చర్స్ అండ్ మంచు ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై ఈ సినిమాను రూపొందించారు.

ఈ నెల 19న వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా దక్ష ది డెడ్‌లీ కాన్సిపిరసీ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ సందర్భంగా ఆదివారం (సెప్టెంబర్ 14) దక్ష రిలీజ్ ప్రెస్ మీట్‌ను హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాకింగ్ స్టార్ మంచు మనోజ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ ఈవెంట్‌లో దర్శకుడితోపాటు పలువురు ఇంట్రెస్టింగ్ విశేషాలు చెప్పారు.

డైరెక్టర్ వంశీకృష్ణ మల్లా మాట్లాడుతూ.. "దక్ష ఒక డిఫరెంట్ థ్రిల...