భారతదేశం, డిసెంబర్ 28 -- అమెరికాలోని అప్పర్ మిడ్‌వెస్ట్ ప్రాంతాన్ని ప్రకృతి వణికించనుంది. ఆదివారం నుంచి సోమవారం వరకు మిచిగాన్, విస్కాన్సిన్, మిన్నెసోటా రాష్ట్రాల్లో అత్యంత ప్రమాదకరమైన మంచు తుపాను (Blizzard) పరిస్థితులు నెలకొంటాయని జాతీయ వాతావరణ విభాగం (NWS) తాజాగా హెచ్చరించింది. ఈ విపరీతమైన వాతావరణ మార్పుల వల్ల రహదారులపై కంటిచూపు ఆననంతగా మంచు కురవడమే కాకుండా, ఈదురుగాలుల ప్రభావంతో ప్రయాణాలు అత్యంత క్లిష్టంగా మారనున్నాయి.

శనివారం మధ్యాహ్నం విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. మిచిగాన్‌లోని అప్పర్ పెనిన్సులా, మధ్య మరియు దక్షిణ మిన్నెసోటా, అలాగే విస్కాన్సిన్‌లోని సుపీరియర్ లేక్ పరిసర ప్రాంతాల్లో మంచు తుపాను హెచ్చరికలు అమల్లో ఉన్నాయి. మొత్తంగా ఈ మూడు రాష్ట్రాల్లోని 34 కౌంటీలపై అధికారులు నిశిత దృష్టి సారించారు.

బహిరంగ ప్రదేశాల్లో మంచు విపరీతంగా పే...