భారతదేశం, జూన్ 7 -- సైన్స్ అండ్ టెక్నాలజీపై ఆసక్తి కలిగి ఉండి.. ప్రభుత్వ ఉద్యోగం కోసం చూస్తే మీ కోసం మంచి ఛాన్స్ ఉంది. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్(ISRO) టెక్నికల్ అసిస్టెంట్, సైంటిఫిక్ అసిస్టెంట్, లైబ్రరీ అసిస్టెంట్ పోస్టుల కోసం రిక్రూట్‌మెంట్‌లను విడుదల చేసింది. ఈ పోస్టులకు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఆసక్తిగల అభ్యర్థులు 18 జూన్ 2025 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇస్రో అధికారిక వెబ్‌సైట్ isro.gov.in లేదా విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ సైట్ vssc.gov.in ని సందర్శించడం ద్వారా అప్లై చేయవచ్చు.

టెక్నికల్ అసిస్టెంట్ (ఎలక్ట్రానిక్స్): 27 పోస్టులు, టెక్నికల్ అసిస్టెంట్ (మెకానికల్): 27 పోస్టులు, టెక్నికల్ అసిస్టెంట్ (కంప్యూటర్ సైన్స్): 12 పోస్టులు, టెక్నికల్ అసిస్టెంట్ (కెమికల్): 8 పోస్టులు. టెక్నికల్ అసిస్టెంట్ (సివిల్, ఆటోమొబై...