Hyderabad, ఏప్రిల్ 13 -- మీ జీవితాన్ని ప్రశాంతంగా మార్చుకోవడమే కాకుండా సింపుల్ పనులతో కొత్తగా మార్చుకోవాలనుకుంటున్నారా.. అయితే ఇవి తెలుసుకోండి. అవి తెలిసిన తర్వాత ఛ.. ఎప్పుడో తెలుసుకుని ఉంటే బాగుండేదని రిగ్రెట్ ఫీలవుతారు. అంతేకాదు, మీ రెగ్యూలర్ లైఫ్ ను చక్కగా తీర్చిదిద్దుకోగలుగుతారు. మరింకెందుకు ఆలస్యం, మీరు అలవరచుకోవాల్సిన, వదిలేయాల్సిన అలవాట్లేంటో తెలుసుకుందామా..

మనలో చాలా మంది సోషల్ మీడియా ఫాలో అవుతుంటారు. అదే సమయంలో కంటికి కనిపించిన పోస్టులకు లైకులు, కామెంట్లు చేస్తుంటారు. కొన్నిసార్లు మనం చేసే కామెంట్లకు రియాక్షన్ వేరేలా ఉండొచ్చు. లేదా మన పోస్టులకు వచ్చే కామెంట్లు మనకి కాస్త బాధ కలిగించేవిగా అనిపించొచ్చు. దాని కోసం మనం మరో కామెంట్ చేస్తే వాదన పెరుగుతుంది, తప్పించి సమస్య పరిష్కారం అవదు. దీని వల్ల మానసిక ప్రశాంతత లోపించడం, సమయం వృథాకా...