Hyderabad, అక్టోబర్ 10 -- చిన్నారి పెళ్లికూతురు సీరియల్ ఫేమ్ అవికా గోర్ ఏడ్చేసింది. మిలింద్ చాంద్వానీతో ఆమె పెళ్లి ఫంక్షన్లు ప్రస్తుతం కలర్స్ టీవీ షో 'పతి పత్ని ఔర్ పంగా'లో జరుగుతున్నాయి. ఈ షో సెట్ నుంచి ఇప్పుడు ఒక వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో అవికా గోర్ ఏడుస్తూ కనిపించడం, మిలింద్ చాంద్వానీ ఆమెకు సర్దిచెప్పడం చూడొచ్చు. అసలు విషయం ఏంటంటే అవికాకు సంబంధించిన మంగళసూత్రం పోవడంతో ఆమె ఏడ్చేసింది. ఈ వీడియో చూసి సోషల్ మీడియా యూజర్లు ఆమెపై మండిపడుతున్నారు.

అవికా గోర్, మిలింద్ చాంద్వానీల పెళ్లికి సంబంధించిన ఎపిసోడ్ ఇంకా టెలికాస్ట్ కావాల్సి ఉంది. ఆ ఎపిసోడ్‌కు సంబంధించిన వీడియోనే ఇప్పుడు వైరల్ అవుతోంది. పెళ్లి దుస్తుల్లో ఉన్న అవికా, తన పక్కనే కూర్చున్న మిలింద్‌తో కనిపిస్తుంది. మిలింద్ చేతిలో మంగళసూత్రం డబ్బా ఉన్నా, అందులో మంగళసూత్రం లేదు. అది పో...