Hyderabad, జూన్ 17 -- వారంలో ఒక్కో రోజు ఒక్కో దేవుడిని ఆరాధిస్తాము. మంగళవారం నాడు ఆంజనేయ స్వామికి ఇష్టమైన రోజు. ఆ రోజున ఆంజనేయ స్వామిని ఆరాధించడం వలన విశేష ఫలితాన్ని పొందవచ్చు. మంగళవారం హనుమంతుడు పూజిస్తే కుటుంబంలో సంతోషాలు కూడా ఉంటాయి. ముఖ్యంగా మంగళవారం నాడు ఆంజనేయ స్వామిని ఆరాధించేటప్పుడు తమలపాకు, సింధూరాన్ని ఉపయోగిస్తే మంచిది. దీని వలన కోరికలన్నీ కూడా తీరిపోతాయి, సంతోషంగా ఉండవచ్చు.

మంగళవారం నాడు సింధూరంతో పూజ చేస్తే మంచి ఫలితాన్ని పొందవచ్చు. మంగళవారం నాడు సింధూరంతో ఆంజనేయ స్వామిని ఆరాధిస్తే మన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. సీతమ్మ వారు పాపిటన సింధూరాన్ని ధరించినప్పుడు, సీతమ్మవారిని ఆంజనేయ స్వామి "ఎందుకు పాపిటన సింధూరాన్ని ధరిస్తున్నారు?" అని అడుగుతాడు. అప్పుడు సీతమ్మ "రాముని క్షేమం కోసం, సకల ఐశ్వర్యాలు పొందడం కోసం సింధూరాన్ని ధరిస్తున్న...