భారతదేశం, జూలై 30 -- సాధారణంగా ఉప్పును సోడియం క్లోరైడ్ అని పిలుస్తారు. హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ వారి 'ది న్యూట్రిషన్ సోర్స్' వెబ్‌సైట్ ప్రకారం, ఉప్పులో 40% సోడియం, 60% క్లోరైడ్ ఉంటాయి. ముఖ్యంగా మనం ఆహారంలో అదనంగా వేసుకునే ఉప్పులోని సోడియం ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం అని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

సోడియం వల్ల శరీరానికి కలిగే నష్టాలు, వాటిని నివారించడానికి ఏం చేయొచ్చో తెలుసుకోవడానికి హెచ్‌టీ లైఫ్‌స్టైల్ నిపుణులను సంప్రదించింది. అసలు ఉప్పు వినియోగంలో భారతదేశం ఎక్కడ ఉంది? ముందుగా, భారతదేశంలో సోడియం వినియోగం ప్రపంచ ఆరోగ్య ప్రమాణాలతో పోలిస్తే ఎలా ఉందో చూద్దాం.

రామయ్య మెమోరియల్ హాస్పిటల్ ఇంటర్నల్ మెడిసిన్ విభాగం హెచ్‌ఓడీ, కన్సల్టెంట్ డా. షేక్ మహ్మద్ అస్లాం మాట్లాడుతూ.. అధిక ఉప్పు వినియోగం వల్ల కిడ్నీల నుంచి గుండె వరకు అనేక కీల...