భారతదేశం, జనవరి 13 -- ప్రతి సంవత్సరం మకర సంక్రాంతి ముందు రోజున భోగి పండుగను జరుపుకుంటాము. భోగి పండుగ నాడు భోగి మంటలు వేయడం, ఇంటి ముందు అందమైన ముగ్గులు వేయడం, పిండి వంటలు వండుకోవడం, చిన్నారులకు భోగి పళ్ళు పోయడం ఇలా రకరకాల పద్ధతులను పాటిస్తూ ఉంటారు. అయితే భోగి గురించి చాలా మంది కొన్ని విషయాలు తెలుసుకోవాలి. భోగి నాడు ఇలా చేస్తే గ్రహ దోషాలు, పీడలు తొలగిపోతాయి

భోగి పండుగ నాడు ఉదయం బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవాలి. బ్రహ్మ ముహూర్తం అంటే ఉదయం నాలుగు నుంచి ఐదు గంటల వరకు. ఈ సమయంలో భోగి మంటలు వేయాలి.

ఇంటికి తూర్పు లేదా ఉత్తర దిశలో ఖాళీగా ఉన్న ప్రదేశంలో ముగ్గు వేసి, దానిపై కర్రలను పేర్చాలి.

మన ఇంట్లో ఉండే పాత చెక్క ముక్కలు, రావి, మేడి, మామిడి చెట్ల కర్రలను, ముఖ్యంగా ఆవు పిడకలను కర్రలపై పేర్చి కర్పూరంతో భోగి మంటను వేయాలి.

మనం అగ్నిని దైవంగా భావిస్తా...