భారతదేశం, జనవరి 4 -- భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్‌ అయింది. ఇందులో భాగంగా ఇవాళ ఉదయం 11 గంటలకు ఢిల్లీ నుంచి భోగాపురానికి ఎయిరిండియా వ్యాలిడేషన్ (టెస్ట్) ఫ్లైట్ చేరుకుంది. ఈ టెస్టింగ్ ఫ్లైట్‌లో కేంద్రమంత్రి రామ్మోహన్‌, ఎంపీ కలిశెట్టి, ఏటీసీ ఛైర్మన్ ప్రయాణం చేశారు.

అత్యాధునిక టెక్నాలజీతో భోగాపురం విమానాశ్రయం నిర్మితమవుతోంది. జూన్‌లో విమానాశ్రయాన్ని ప్రారంభించనున్నారు. జీఎంఆర్‌ సంస్థ ఈ పనులను చేపట్టింది. 280 కి.మీ వేగంతో వీచే తుపాను గాలులను తట్టుకునేలా విమానాశ్రయ నిర్మాణం చేపట్టారు.

రన్‌వే, టెర్మినల్‌ భవనాలు, ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్, భద్రతా వ్యవస్థ తదితర కీలక మౌలిక సదుపాయాల కల్పన పనులు తుది దశకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలోనే. ఇవాళ(జనవరి 4, 2026) తొలి కమర్షియల్ ఫ్లైట్ ట్రయల్ రన్‌ విజయవంతంగా పూర్తి అయింది.

విజయనగరం జిల్లాలో న...