Hyderabad,telangana, ఏప్రిల్ 17 -- తెలంగాణ ప్రభుత్వం భూ భారతి చట్టం అమలును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఏప్రిల్ 14వ తేదీన పోర్టల్ ను కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. ఫలితంగా రెవెన్యూ వ్యవస్థలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం రాష్ట్రంలోని నాలుగు మండలాల్లో మాత్రమే ఈ సేవలు అందుబాటులోకి రాగా. త్వరలోనే అన్ని మండలాల్లోనూ ప్రారంభిస్తారు.

గతంలో ధరణి పోర్టల్ లో ఉన్న ఇబ్బందులకు అవకాశం ఇవ్వకుండా..రైతుకు అన్ని విధాలా అనుకూలంగా ఉండేలా భూ భారతి పోర్టల్ ను తీసుకువచ్చినట్లు ప్రభుత్వం చెబుతోంది. అత్యంత సరళమైన భాషతో పాటు తక్కువ మాడ్యూల్స్ తో సేవలు అందుబాటులో ఉంటాయని స్పష్టం చేస్తోంది.

భూ- భారతి చట్టం ప్రకారం... ప్రతి భూకమతానికి భూ ఆధార్‌ రానుంది. ఇందుకోసం ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది. హక్కుల బదలాయింపు జరగ్గానే గ్రామ పహాణీలో నమోదయ్యేలా...