Mulugu district,venkatapuram, ఏప్రిల్ 16 -- భూ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన 'భూ భారతి' పోర్టల్ అమలులోకి వచ్చింది. క్షేత్రస్థాయిలో భూ సమస్యలు, వివాదాలు పేరుకుపోగా.. ప్రభుత్వం తీసుకొచ్చిన భూ భారతితో వాటన్నింటికీ పరిష్కారం దొరుకుతుందనే ఆశలు రేకెత్తుతున్నాయి.

రాష్ట్రంలోని నాలుగు మండలాలను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి భూ భారతిని అమలు చేస్తుండగా.. అందులో నారాయణపేట జిల్లా మద్దూరు, కామారెడ్డి జిల్లా లింగంపేట, ఖమ్మం జిల్లా నేలకొండపల్లితో పాటు ములుగు జిల్లా వెంకటాపూర్ కు స్థానం దక్కింది. రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ధనసరి అనసూయ ( సీతక్క) ప్రాతినిథ్యం వహిస్తున్న ములుగు జిల్లాలోని వెంకటాపూర్ మండలాన్ని పైలట్ ప్రాజెక్ట్ గా ఎంపిక చేయగా.. మండలంలోని రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది.

ములుగు జిల్లాలో తొమ్మిద...