భారతదేశం, జనవరి 22 -- ముఖ్యమంత్రి చంద్రబాబుపై జగన్ ఫైర్ అయ్యారు. వైసీపీ హయాంలో అమలు చేసిన భూముల రీసర్వే కార్యక్రమంపై ముఖ్యమంత్రి చంద్రబాబు 'క్రెడిట్ చోరీ' చేస్తున్నారని ఆరోపించారు.ఈ భూమండలం మీద ఇంత దారుణమైన క్రెడిట్ చోరీ చేయగలవారు ఎవరూ ఉండరంటూ దుయ్యబట్టారు.

గురువారం తాడేపల్లిలోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో జగన్ మీడియాతో మాట్లాడారు. 2019 అసెంబ్లీ ఎన్నికలకు ముందుకు నిర్వహించిన తన పాదయాత్రలోనే భూముల రీసర్వేపై హామీ ఇచ్చానని గుర్తు చేశారు. అందుకు తగ్గట్టుగానే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత. 'వైఎస్సార్ జగన్నన్న శాస్వత భూహక్కు మరియు భూ రక్షా పథకం' (సమగ్ర భూ పునఃసర్వే) రూపొందించినట్లు తెలిపారు.

"మేం అధికారంలోకి వస్తే సమగ్ర భూ సర్వే చేయిస్తానని 2019 ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టాం. రైతులకు, ప్రజలకు వివాదాలు లేనివిధంగా, పారదర్శకంగా భూములు స...