భారతదేశం, జనవరి 22 -- భూముల రీసర్వేపై మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఘాటుగా స్పందించారు. రీ సర్వేను 2018లోనే జగ్గయ్య పేట మండలం తక్కెళ్లపాడు గ్రామంలో టీడీపీ ప్రభుత్వం ప్రారంభించిందని గుర్తు చేశారు. అప్పుడే రీ సర్వేను అత్యాధునిక టెక్నాలజీతో చేసేందుకు ఆర్వోఆర్ చట్టంలో మార్పులు తీసుకువస్తూ గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చారని చెప్పారు. కానీ జగన్ రెడ్డి మాత్రం తానే రీ సర్వేను కనిపెట్టినట్లు క్రిమినల్ క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారని విమర్శించారు.

చంద్రబాబు గురించి మాట్లాడే కనీస అర్హత జగన్ కు లేదన్నారు. వైసీపీ ప్రభుత్వం రీ సర్వేను పూర్తిగా తప్పుల తడకగా నిర్వహించిందన్నారు. అందుకే ప్రజలు రీ సర్వే పై తమ ప్రభుత్వానికి 2.7 లక్షల ఫిర్యాదులు చేశారని చెప్పారు. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ను అడ్డం పెట్టుకొని ప్రజల భూమ...