Telangana,hyderabad, ఆగస్టు 17 -- రాష్ట్రంలోని భూసమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భూభార‌తి చట్టాన్ని తీసుకువచ్చిందని రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. భూముల రిజిస్ట్రేష‌న్ స‌మ‌యంలో స‌ర్వే మ్యాప్ త‌ప్పనిస‌రి చేసిందని గుర్తు చేశారు. కాబట్టి ఇందుకు అవ‌స‌ర‌మైన లైసెన్స్ డ్ స‌ర్వేయ‌ర్ల సేవ‌ల‌ను అక్టోబ‌ర్ 2 గాంధీ జ‌యంతి నాటికి అందుబాటులోకి తీసుకువ‌స్తామని ప్రకటించారు.

లైసెన్స్ డ్ స‌ర్వేయ‌ర్ల నియామకం పై ఆదివారం మంత్రి పొంగులేటి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇప్ప‌టికే మొద‌టి విడ‌త స‌ర్వేయ‌ర్ల శిక్ష‌ణ పూర్తయిందన్నారు. రెండవ విడ‌త శిక్ష‌ణ ఈనెల 18 నుంచి 23 జిల్లా కేంద్రాల్లో శిక్ష‌ణ ప్రారంభం కానుందని వివరించారు. అభ్యర్ధులు 18వ తేదీ ఉద‌యం 10 గంటల లోపు ఆయా జిల్లాల్లో స‌ర్వే విభాగం అసిస్టెంట్...