భారతదేశం, డిసెంబర్ 13 -- జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దారుణం వెలుగు చూసింది. భార్యను ఉరివేసి చంపేసిన భర్త.ఆపై అతను కూడా అత్మహత్య చేసుకున్నాడు. అంతేకాదు భార్యను చంపేసిన తర్వాత తీసిన వీడియోను వాట్సాప్ స్టేటస్ గా పెటుకున్నాడు. చంపటానికి గల కారణాలను కూడా ఈ వీడియోలో చెప్పాడు. గమనించిన బంధువులు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వటంతో..పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ప్రాథమిక వివరాల ప్రకారం.. గణపురం మండలం సీతారాంపురం గ్రామంలో బాలాజీ రామాచారి(50), సంధ్య దంపతులుగా ఉంటున్నారు. వీరి మధ్య కొంతకాలంగా విబేధాలు ఉన్నట్లు తెలిసింది. ఈ క్రమంలోనే ఇంట్లో ఒంటరిగా ఉన్న భార్య సంధ్యను ఉరి వేసి చంపేశాడు. తాను కూడా ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అంతేకాదు ఓ వీడియోను తన మొబైల్ లో వాట్సాప్ స్టేటస్ గా పెట్టాడు...