భారతదేశం, డిసెంబర్ 24 -- మహాభారతంలో భీష్మ పితామహుడు యుధిష్ఠిరుడికి అనేక ముఖ్యమైన జీవిత నియమాలను బోధించాడు. వీటిని భీష్మ నీతి అని పిలుస్తారు. వీటిలో ఆహార నియమాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ఆహారం కడుపు నింపడానికి మాత్రమే కాదు. ఆహారం శరీరం, మనస్సు, ఆత్మను శుద్ధి చేస్తుంది అని భీష్మ పితామహుడు అంటాడు.

సరైన ఆహారం తీసుకోకపోతే ఆరోగ్యం క్షీణిస్తుంది, ఆయుష్షు తగ్గుతుంది. జీవితంలో సమస్యలు పెరుగుతాయి. అకాల మరణం, బాధలకు కారణమయ్యే ఈ నాలుగు రకాల ఆహారాలను నివారించాలి అని భీష్ముడు సూచించాడు. ఈ నియమాలు నేటికీ పాటించడం ముఖ్యం. మరి అవేంటి ఇప్పుడు తెలుసుకుందాం.

ఇతరుల పళ్లెంలో మిగిలిపోయిన ఆహారం తినడం మంచిది కాదని భీష్మ నీతి చెబుతుంది. ఇది వ్యక్తిత్వ గౌరవాన్ని తగ్గిస్తుంది. ప్రతికూల శక్తి శరీరంలోకి ప్రవేశిస్తుంది. మిగిలిపోయిన ఆహారం తినడం వల్ల ఆయుష్షు తగ్గుతుం...