భారతదేశం, జూన్ 30 -- ఉత్తర్​ప్రదేశ్​లో జరిగిన ఒక దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది! 45ఏళ్ల వ్యక్తి ఆస్తిపై కన్నేసిన ఓ మహిళ.. మారువేషంలో ఆయన్ని వివాహం చేసుకుంది. పెళ్లి జరిగిన రెండు గంటల్లోనే, తన సహచరులతో కలిసి చంపేసింది.

పలు మీడియా కథనాల ప్రకారం మధ్యప్రదేశ్​ జబల్​పూర్​కి చెందిన ఇంద్రకుమార్​ తివారీకి 18 ఎకరాల భూమి ఉంది. కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆయనకు పెళ్లి అవ్వడం లేదు. తీవ్ర మనస్తాపానికి గురైన తివారీ గత నెలలో మతగురువు గురు అనురుద్ధచార్య మహరాజ్​ దగ్గరికి వెళ్లాడు. అందరి ముందు తన బాధను గురువుతో చెప్పుకున్నాడు. తనకు ఆస్తి చాలానే ఉన్నప్పటికీ, పెళ్లి జరగడం లేదన్న అసహనంతో ఉన్నట్టు, తనతో కలిసి తన భూమిని చూసుకోవడానికి ఎవరూ లేరని చెప్పాడు.

ఆ మాటలు విన్న గురువు.. "సాధువు అయిపోయి, ఆ భూమిని ప్రజా సేవకు అంకితమివ్వమని" అని హాస్యం చేశారు. ఈ వీడియో ఇప్...