Hyderabad, మే 2 -- గర్భవతిగా ఉన్నప్పుడు అందరూ తల్లి అలవాట్లు, ఆమె చేసే పనుల గురించే ఎక్కువ మంచి ఆలోచిస్తారు. కానీ ఈ సమయంలో భర్త చేసే పనులు కూడా చాలా ముఖ్యమైనవి. తల్లి, బిడ్డ ఆరోగ్యంగా ఉండాలంటే, భార్య కడుపుతో ఉన్న సమయంలో భర్త కొన్ని విషయాల్లో చురుకుగా పాల్గొనడం చాలా ముఖ్యం. ఎందుకంటే.. భర్త మద్దతు ఉంటేనే ఇంట్లో మంచి వాతావరణం ఏర్పుడుతుంది. దానివల్ల తల్లి ఒత్తిడి తగ్గి, గర్భం సురక్షితంగా, సంతోషంగా ఉంటుంది. బిడ్డ కూడా బాగా ఎదుగుతుంది. కడుపుతో ఉన్నప్పుడు భర్త చేయాల్సిన పనులేంటో తెలుసుకుందాం రండి.

గర్భం దాల్చిన సమయంలో మహిళకు మానసిక మద్దతు చాలా ముఖ్యం. హార్మోన్ల మార్పులు, ఒంట్లో వచ్చే ఇబ్బందుల వల్ల ఆమె మూడ్స్ మారుతూ ఉంటాయి. అప్పుడు భర్త ఓపికగా వ్యవహరించాలి. ఆమె మాట వినాలి. ఆమె చెప్పేది అర్థం చేసుకోవాలి. ఆమెను తప్పుగా చూడకుండా, ఆమె భయాన్ని తగ్గిం...