భారతదేశం, నవంబర్ 10 -- బాలీవుడ్ నటుడు, ఒకప్పటి స్టార్ హీరో గోవిందపై అతని భార్య సునీత అహుజా సంచలన ఆరోపణలు చేసింది. ఒక స్టార్ భార్యగా ఉండటం ఎంత కష్టమో తెలిపింది. ఇటీవల పింక్‌విల్లాతో జరిగిన సంభాషణలో సునీత తమ వివాహం, గోవింద గతంలో చేసిన తప్పుల గురించి బహిరంగంగా చెప్పింది. అంతేకాకుండా తరువాత జన్మలో గోవింద తనకు భర్తగా వద్దు అని కూడా స్పష్టం చేసింది.

సునీత తన భర్త గోవింద చేసిన గత తప్పుల గురించి మాట్లాడింది. "మనల్ని మనం అదుపులో ఉంచుకోవాలి. యవ్వనంలో మనిషి తప్పులు చేస్తాడు. నేను చేశాను. గోవింద కూడా చేశారు. కానీ మీకు ఒక నిర్దిష్ట వయస్సు వచ్చినప్పుడు, మీరు తప్పులు చేస్తే అది బాగుండదు. పైగా మీకు అందమైన కుటుంబం, మంచి భార్య, అద్భుతమైన పిల్లలు ఉన్నప్పుడు అలాంటి తప్పులు ఎందుకు చేయాలి" అని సునీత చెప్పింది.

దీని గురించి గోవిందను ఎప్పుడైనా నిలదీశారా అని అడ...