భారతదేశం, జూలై 14 -- న్యూఢిల్లీ, జూలై 14, 2025: దాంపత్య జీవితంలో కలహాలు, విడాకుల కేసులు (matrimonial cases) వచ్చినప్పుడు.. భార్యాభర్తలు రహస్యంగా రికార్డు చేసుకున్న సంభాషణలను కోర్టులో సాక్ష్యంగా చూపించవచ్చని సుప్రీంకోర్టు సోమవారం స్పష్టం చేసింది. ఒకరిపై ఒకరు అనుమానంతో లేదా బలహీనపడిన బంధంతో సంభాషణలను రికార్డు చేసుకుంటున్నారంటేనే ఆ వివాహం సజావుగా లేదని అర్థమని, కాబట్టి వాటిని కోర్టు విచారణలో పరిగణనలోకి తీసుకోవచ్చని అత్యున్నత న్యాయస్థానం తెలిపింది.

పంజాబ్, హర్యానా హైకోర్టు గతంలో ఇచ్చిన ఒక తీర్పును జస్టిస్ బి.వి. నాగరత్న, జస్టిస్ సతీష్ చంద్ర శర్మలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం పక్కన పెట్టింది. అంతకుముందు, హైకోర్టు "భార్యాభర్తల మధ్య రహస్య సంభాషణలకు సాక్ష్యాధారాల చట్టంలోని సెక్షన్ 122 ప్రకారం రక్షణ ఉంటుంది. వాటిని కోర్టులో వాడకూడదు" అని చెప్పి...