భారతదేశం, జనవరి 1 -- 2026 న్యూ ఇయర్ వేడుకల్లో పాటలు ఆలపించి అందరినీ ఉత్సాహపరచాలని వచ్చిన ఆ సంగీత కళాకారులకు చేదు అనుభవం ఎదురైంది. ప్రముఖ మ్యూజిక్ కంపోజర్స్, సింగర్స్, భార్యాభర్తలు సచేత్ టాండన్, పరంపర ఠాకూర్ (సచేత్-పరంపర)కు మంచి క్రేజ్ ఉంది.

తాజాగా సచేత్-పరంపరకు న్యూ ఇయర్ వేడుకల్లో చేదు అనుభవం ఎదురైదంది. వీరు ప్రయాణిస్తున్న కారు అభిమానుల దాడికి గురైంది. కారును అభిమానులు చుట్టుముట్టడమే కాకుండా.. కారు అద్దాలను కూడా పగలగొట్టారు. పశ్చిమ బెంగాల్‌లోని బలూర్‌ఘాట్‌లో న్యూ ఇయర్ ఈవ్ కాన్సర్ట్ ముగించుకుని తిరిగి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. సచేత్, పరంపరలు తమ కారులో ప్రయాణిస్తుండగా, వందలాది మంది అభిమానులు ఒక్కసారిగా కారును చుట్టుముట్టారు. సచేత్ నవ్వుతూ అభిమానులకు అభివాదం చేస్తున్న సమయంలో, ఎవరో కారు మ...