భారతదేశం, జనవరి 6 -- భార్యాభర్తల సంబంధాల్లోని చీకటి కోణాలను, కుటుంబాల్లో జరిగే దారుణాలను కళ్లకు కట్టే జానర్ 'ట్రూ క్రైమ్'. ఈ కోవలో వస్తున్న లేటెస్ట్ సిరీస్ 'హనీమూన్ సే హత్య' (Honeymoon Se Hatya). భర్తలను చంపిన భార్యల కథలతో, ఆ నేరాల వెనుక ఉన్న అసలు కారణాలను విశ్లేషిస్తూ ఈ సిరీస్ రాబోతోంది. జనవరి 9 నుంచి ఈ సిరీస్ జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. తాజాగా మేకర్స్ దీనికి సంబంధించిన ఆసక్తికరమైన టీజర్‌ను విడుదల చేశారు.

పెళ్లి అనే బంధం ప్రేమతో మొదలై.. ద్వేషంతో ఎలా ముగుస్తుందో, ఒక పవిత్రమైన బంధం హంతక ఆలోచనగా ఎలా మారుతుందో ఈ హనీమూన్ సే హత్య డాక్యు-సిరీస్ చూపిస్తుంది. ఈ సిరీస్ టీజర్ చాలా బోల్డ్ గా, గగుర్పాటు కలిగించేలా ఉంది. కేవలం వార్తలను చూపించడమే కాకుండా.. "అసలు ఆడవాళ్లు తమ భర్తలను ఎందుకు చంపుతున్నారు?" అనే కఠినమైన ప్రశ్నకు సమాధానం వెతికే ప్రయత్న...