భారతదేశం, జూన్ 14 -- మధ్యప్రదేశ్ లోని ఒక అద్భుతమైన తాజ్ మహల్ తరహా ఇంటిని ప్రదర్శించే ఒక వీడియో ఒకటి ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. పూర్తిగా తాజ్ మహల్ శైలిలో దీనిని నిర్మించారు. ఆనంద్ ప్రకాశ్ చౌక్సే అనే వ్యక్తి ఈ నయా తాజ్ మహల్ ను నిర్మించి తన భార్యకు కానుకగా ఇచ్చాడు.

మధ్యప్రదేశ్ లోని బుర్హాన్పూర్ లో ఈ కొత్త తాజ్ మహల్ ఉంటుంది. స్థానికంగా ఒక పాఠశాలను నిర్వహించే ఆనంద్ ప్రకాశ్ చౌక్సే దీనిని నిర్మించాడు. తాను స్వయంగా స్థాపించిన పాఠశాల ప్రాంగణంలోనే ఇది ఉంది. ఇది 4 బీహెచ్ కే విల్లా తరహా ఇల్లు. దీనిని ఆగ్రాలో తాజ్ మహల్ ను నిర్మించిన మక్రానా పాలరాతితోనే నిర్మించారు. అయితే, పరిమాణం పరంగా, ఇది ఆగ్రా తాజ్ మహల్ కన్నా చిన్నది. ఆగ్రా తాజ్ మహల్ తో పోలిస్తే ఇది మూడింట ఒక వంతు మాత్రమే ఉంటుంది. కానీ, నాలుగు వైపులా పిల్లర్లు, డోమ్ అన్నీ ఒరిజినల్ ఆగ్రా తాజ్ మ...