Hyderabad,america, సెప్టెంబర్ 18 -- హైదరాబాద్ కు చెందిన ఓ మహిళ తన ఎన్నారై భర్త మోసం చేశాడని పోలీసులను ఆశ్రయించింది. తనను భారత్ లో వదిలేసి పాస్ పోర్ట్, గ్రీన్ కార్డు, విలువైన వస్తువులతో పారిపోయాడని ఆరోపించింది. తనకు జరిగిన మోసంపై సీఎం రేవంత్ రెడ్డితో పాటు కేంద్ర విదేశాంగ మంత్రికి లేఖలు రాసింది. తన భర్తపై చర్యలు తీసుకోవాలని ఈ లేఖలో ప్రస్తావించింది.

ఫిర్యాదులోని వివరాల ప్రకారం.. హైదరాబాద్ కు చెందిన హనా అహ్మద్ ఖాన్‌ను.. అమెరికాలోని చికాగో పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో అధికారిగా ఉన్న మహ్మద్ జైనుద్దీన్‌తో 2022 జూన్ లో వివాహమైంది. అతను అమెరికా పౌరసత్వం ఉంది. పెళ్లి అయిన తర్వాత భార్య హనా అహ్మద్ ఖాన్‌ తల్లిదండ్రుల వద్ద కొంత కాలం గడిపింది. అతను మాత్రం ఉద్యోగం నిమిత్తం తిరిగి అమెరికాకు వెళ్లిపోయాడు. ఈ లోపు కూతురికి సంబంధించి వీసా పనులను పూర్తయ్యాయి. దీం...