భారతదేశం, జూన్ 17 -- ప్రేమబంధంలో కొన్నిసార్లు ఆచరణాత్మక ఆలోచనలు, కొన్నిసార్లు భావోద్వేగమైన స్పందనలు గెలుస్తుంటాయి. అయితే, ఇటీవల రెడిట్‌లో ఒక వ్యక్తి పెట్టిన పోస్ట్ భార్యాభర్తల మధ్య ఇలాంటి ఒక సంఘర్షణను బయటపెట్టి, నెటిజన్లను రెండుగా చీల్చింది. తన భార్యను ఎయిర్‌పోర్టుకు వెళ్లి తీసుకెళ్లనందుకు తాను తప్పు చేశానా అని ఆ భర్త అడగ్గా, చాలామంది యూజర్లు భావోద్వేగాలకు, చిన్నచిన్న పనులకు ఇచ్చే ప్రాధాన్యతను నొక్కి చెప్పారు.

జూన్ 14న రెడిట్‌లోని AmItheA***ole (AITA) కమ్యూనిటీ పేజీలో ఒక యూజర్ తన అనుభవాన్ని పంచుకున్నారు. ఇక్కడ ప్రజలు తమ తప్పు ఒప్పులను ఇతరుల అభిప్రాయాలకు వదిలేస్తారు. సదరు రెడిట్ యూజర్ తాను, తన భార్య ఒక నగరానికి ప్రయాణిస్తున్నామని, అయితే పని నిమిత్తం తాను ఒక వారం ముందుగానే వచ్చి ఎయిర్‌బిఎన్‌బిలో ఉంటున్నానని చెప్పాడు. తన భార్య తర్వాత వచ్చిన...