భారతదేశం, అక్టోబర్ 3 -- ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో చాలా చోట్ల వాగులు, వంకలు పొంగిపోర్లుతున్నాయి. వంశధారతో పాటు గొట్టా బ్యారేజీకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. భారీ వర్షాలు, వరదల దాటికి ఇప్పటి వరకు నలుగురు చనిపోయినట్లు అధికారులు తెలిపారు.

ఉత్తరాంధ్రలోని వర్షాలు, వరద పరిస్థితులపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ తదితర జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ప్రస్తుతం జిల్లాల్లో ఉన్న పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.

గొట్టా బ్యారేజ్ క్యాచ్ మెంట్లో 33 టీఎంసీలు, తోటపల్లి పరిధిలో 11 టీఎంసీలు మేర వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. గొట్టా బ్యారేజికి 1.89 లక్షల క్యూసెక్కులు, తోటపల్లికి 44 వేల క్యూసెక్కుల వరద వస్తోందని వివరించారు. ఒడిస్సాల్లోని ప్రాంతాల్లో పడిన భారీ వర్షాల కా...