భారతదేశం, మే 19 -- గత రెండు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు గార్డెన్​ సిటీగా, భారత దేశ సిలికాన్​ వ్యాలీగా పేరొందిన బెంగళూరు అల్లాడిపోతోంది. అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. వీధులే కాదు, ఇళ్లల్లోకి నీరు చేరడంతో ప్రజలు కష్టాలు పడుతున్నారు. రోడ్డు మీద నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్​ సమస్యలు తీవ్రంగా మారాయి.

బెంగళూరులో భారీ వర్షాల కారణంగా హోరమావు ప్రాంతంలో ఇళ్లలోకి నీరు చేరిందని, దీంతో ప్రజలు చిక్కుకుపోయారని, తమ వస్తువులను కాపాడుకునేందుకు నానా అవస్థలు పడ్డారని తెలుస్తోంది.

గ్రౌండ్ ఫ్లోర్ ఇళ్లలోకి నీరు చేరడంతో పాటు హోరమవు ప్రాంతంలోని ఫర్నిచర్, ఉపకరణాలు ధ్వంసమయ్యాయి. నీరు నిలిచిపోవడంతో పలు రహదారులు అగమ్యగోచరంగా మారడంతో పాటు ప్రజారవాణా సేవలు మందగించడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు.

గత 24 గంటల్లో (ఆదివారం రాత్రి నాటికి) బెంగళూరులో 4...