భారతదేశం, మే 25 -- ఆదివారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షానికి దిల్లీలోని పలు ప్రాంతాలు, జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్సీఆర్)లోని కొన్ని ప్రాంతాలు నీట మునిగాయి. భారీ వర్షాలు, బలమైన గాలుల కారణంగా దిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

గంటకు 60 కిలోమీటర్ల వేగంతో వీచే ఈదురుగాలులు ఆదివారం ఉదయం దిల్లీలో 21.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

భారీ ఉరుములు, ఈదురుగాలులు, పిడుగులు పడే అవకాశం ఉందని దిల్లీ, పరిసర ప్రాంతాలకు ఐఎండీ శనివారం రెడ్ అలర్ట్ కూడా జారీ చేసింది.

భారీ వర్షాల కారణంగా ఏర్పడిన అంతారాయానికి సంబంధించిన దృశ్యాలు సోషల్​ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కొన్ని చోట్ల నీటి మట్టాలు పెరిగి చిన్న వాహనాలను ముంచెత్తాయి.

మింటో రోడ్​లో ఒక కారు దాదాపు పూర్తిగా నీటి అడుగున కనిపించడంతో ఆ ప్రాం...