భారతదేశం, జూన్ 26 -- స్పేస్ రంగంలో ఏపీని అగ్రపథాన నిలపడంతో పాటు, రూ.25 వేల కోట్ల పెట్టుబడులు ఆకర్షించేలా స్పేస్ పాలసీ 4.0ని తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రిచంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. పెట్టుబడుల లక్ష్యం నెరవేరితే ప్రత్యక్షంగా 5 వేల మందికి, పరోక్షంగా 30 వేల మందికి ఉపాధి కలుగుతుందని అన్నారు.

లేపాక్షి, తిరుపతిలో స్పేస్ సిటీ ఏర్పాటుకు ఆమోదం తెలిపిన ముఖ్యమంత్రి...2025 - 2035 కాలానికి సంబంధించి స్పేస్ రంగంలో వ్యూహాత్మక లక్ష్యాలను నిర్దేశించారు. గురువారం ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ స్పేస్ పాలసీ 4.0పై ముఖ్యమంత్రి అధికారులతో సమీక్ష నిర్వహించారు. విద్యాసంస్థలను ఇందులో భాగస్వాములు చేయడం ద్వారా విద్యార్ధులు ఈ రంగం వైపు ఆకర్షితులు అయ్యేలా చూడాలని ముఖ్యమంత్రి అన్నారు. అలాగే ప్లగ్ అండ్ ప్లే విధానంలో వినియోగించుకునేలా కామన్ ఇన్ఫ్రాస్...