భారతదేశం, ఆగస్టు 13 -- పేటీఎం మాతృసంస్థ వన్ 97 కమ్యూనికేషన్స్ షేర్లు బుధవారం ట్రేడింగ్ సెషన్‌లో భారీ లాభాలతో దూసుకెళుతున్నాయి. పేటీఎం అనుబంధ సంస్థ అయిన పేటీఎం పేమెంట్ సర్వీసెస్ లిమిటెడ్​కు ఆన్‌లైన్ పేమెంట్ అగ్రిగేటర్‌గా పనిచేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) సూత్రప్రాయంగా ఆమోదం తెలపడం దీనికి ప్రధాన కారణం. ఈ వార్తతో, బుధవారం మద్యాహ్నం 12 గంటలకు పేటీఎం షేర్ ధర 5.27% పెరిగి Rs.1,179కి చేరింది.

ఆర్బీఐ విడుదల చేసిన ప్రకటన ప్రకారం 2021 మార్చి 31న జారీ చేసిన 'పేమెంట్ అగ్రిగేటర్లు, పేమెంట్ గేట్‌వేల నియంత్రణ మార్గదర్శకాలు'కు పీపీఎస్​ఎల్​ కట్టుబడి ఉంటేనే ఈ ఆమోదం వర్తిస్తుంది. ఈ ఆమోదం కేవలం పీఏ కార్యకలాపాలకు మాత్రమే వర్తిస్తుందని ఆర్బీఐ స్పష్టం చేసింది. మెర్చంట్ 'పే-అవుట్స్' వంటి ఇతర లావాదేవీలను పీఏ కార్యకలాపాల కోసం ఉద్దేశించిన ఎస్క్రో అక...