భారతదేశం, నవంబర్ 21 -- రాష్ట్రంలో భారీగా ఐపీఎస్‌ల బదిలీలు జరిగాయి. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. సీఐడీ కొత్త డీజీగా పరిమళన్‌ నూతన్‌ నియమితులు కాగా. పోలీస్‌ అకాడమీ డిప్యూటీ డైరెక్టర్‌గా చేతన్‌, మహేశ్వరం డీసీపీగా నారాయణరెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. పలు జిల్లాలకు కొత్త ఎస్పీలు కూడా వచ్చారు.

ఈ బదిలీల్లో భాగంగా ములుగు జిల్లా ఎస్పీగా కేక‌న్ సుధీర్ రామ్‌నాథ్‌, జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి జిల్లా ఎస్పీగా సంకీర్త్,నాగర్‌ కర్నూల్ జిల్లా ఎస్పీగా సంగ్రామ్‌ పాటిల్‌,మహబూబాబాద్‌ ఎస్పీగా శబరీష్‌,వనపర్తి ఎస్పీగా సునీత,వికారాబాద్‌ జిల్లా ఎస్పీగా స్నేహ మిశ్ర నియమితులయ్యారు.

గ‌వ‌ర్న‌ర్ ఏడీసీగా పాటిల్ కాంతిలాల్ సుభాష్‌, పెద్ద‌ప‌ల్లి డీసీపీగా రామ్ రెడ్డి, భ‌ద్రాద్రి కొత్త‌గూడెం అడిష‌న‌ల్ ఎస్పీగా అవినాష్ కుమార్, భువ‌న‌గిరి అడిష‌న‌ల్ ఎస్పీగా క...