భారతదేశం, నవంబర్ 8 -- భారతదేశ వృద్ధి-ద్రవ్యోల్బణ అంశాలు అనుకూలంగా ఉన్నప్పటికీ, భారతీయ స్టాక్ మార్కెట్ కొత్త శిఖరాలను చేరుకోవడానికి తడబడుతోంది. ఈ విషయం మదుపర్లను ఆందోళనకు గురిచేస్తోంది.

గతంలో, స్థిరమైన Q2 ఆదాయాలు, భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంపై ఉన్న ఆశల మద్దతుతో, సెన్సెక్స్, నిఫ్టీ 50 వరుసగా అక్టోబర్ 23న 52 వారాల గరిష్ట స్థాయిలైన 85,290, 26,104 ను తాకాయి. రాబోయే కొద్ది రోజుల్లో మార్కెట్లు కొత్త శిఖరాలను అధిరోహిస్తాయని ఇది ఆశలు రేపింది.

అయితే, ఆ తర్వాత జరిగింది అంచనాలకు పూర్తి విరుద్ధం! దేశీయ స్టాక్​ మార్కెట్‌లో అన్ని సెగ్మెంట్లలో లాభాల స్వీకరణ కనిపించింది. ఫలితంగా, సెన్సెక్స్- నిఫ్టీ 50 వరుసగా రెండవ వారం పాటు నష్టాలను కొనసాగించే దిశగా పయనిస్తున్నాయి.

దేశీయ మార్కెట్ అనుకూల- ప్రతికూల అంశాల మధ్య నలిగిపోతోంది! మార్కెట్‌కు ముఖ్యమైన సానుకూలత...