భారతదేశం, అక్టోబర్ 6 -- విశాఖపట్నంలో భారత నౌకదళంలోకి మరో యాంటి సబ్ మెరైన్ వార్‌ఫైర్ ఐఎన్ఎస్ ఆండ్రోత్ చేరింది. స్వదేశీ పరిజ్ఞాన్ని ఎక్కువగా ఉపయోగించి దీన్ని తయారు చేశారు. ఐఎన్ఎస్ ఆండ్రోత్‌ను ఈఎన్‌సీ చీఫ్ పెందార్కర్ ప్రారంభించారు. భారత నావికాదళంలో రెండో యాంటి సబ్‌మెరైన్ వార్‌ఫైర్‌గా చేరింది ఐఎన్ఎస్ ఆండ్రోత్. మూడు నెలల క్రితం ఐఎన్ఎస్ ఆర్నాల మెుదట యాంటి సబ్ మెరైన్ వార్‌ఫైర్‌గా భారత నౌకదళంలో చేరిన విషయం తెలిసిందే.

ఆండ్రోత్‌ను నౌకను కలకత్తాకు చెందిన గార్డెన్ రీచ్ షిప్ బిల్లింగ్ అండ్ ఇంజినీర్స్ కంపెనీ తయారు చేసింది. లక్షద్వీప్ దీవుల్లో ఒక దీవీ పేరు మీదుగా ఐఎన్ఎస్ ఆండ్రోత్‌కు నామకరణం చేశారు. ఈ నౌకతో భారత సముద్ర భద్రత మరింత బలపడనుంది. సముద్ర తీర ప్రాంతాల్లో సబ్ మెరైన్ ధ్వంసం, కంట్రోల్, కోస్టల్ ప్రొటెక్షన్ కోసం ఆండ్రోత్‌ను ఉపయోగిస్తారు. తీరానికి ద...