భారతదేశం, డిసెంబర్ 25 -- భారత రక్షణ రంగం మరో చారిత్రాత్మక మైలురాయిని అధిగమించింది. శత్రువుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించేలా, సముద్ర గర్భం నుంచి అణు దాడులు చేయగల 'కే-4' (K-4) క్షిపణిని డీఆర్డీఓ (DRDO) విజయవంతంగా పరీక్షించింది. డిసెంబర్ 23న బంగాళాఖాతంలో స్వదేశీ అణు జలాంతర్గామి 'ఐఎన్ఎస్ అరిఘాత్' (INS Arighaat) నుంచి ఈ ప్రయోగాన్ని నిర్వహించారు.

భూమి, ఆకాశం, సముద్రం.. ఈ మూడు మార్గాల నుంచి అణు దాడులను ఎదుర్కొనేలా 'అణు త్రయం' (Nuclear Triad) సామర్థ్యాన్ని సిద్ధం చేసుకోవడంలో భారత్ తుది దశకు చేరుకుంది. 3,500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగల ఈ కే-4 క్షిపణులను మరికొన్ని పరీక్షల అనంతరం స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ (SFC)కు అప్పగించనున్నారు.

నిజానికి ఈ పరీక్ష డిసెంబర్ మొదటి వారంలోనే జరగాల్సి ఉంది. అయితే, ఆ సమయంలో బంగాళాఖాతానికి సమీపంలో చైనాకు చ...