భారతదేశం, మే 4 -- వుమెన్స్ వన్డే ట్రై సిరీస్ లో భారత మహిళల జట్టుకు షాకింగ్ ఓటమి ఎదురైంది. ఆదివారం (మే 4) కొలంబోలో జరిగిన వన్డేలో భారత్ 3 వికెట్ల తేడాతో శ్రీలంక చేతిలో ఓడింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఇండియా 50 ఓవర్లలో 9 వికెట్లకు 275 పరుగులు చేసింది. రిచా ఘోష్ (48 బంతుల్లో 58; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) అదరగొట్టింది.

ఛేజింగ్ లో 7 వికెట్లు కోల్పోయిన శ్రీలంక 49.1 ఓవర్లలో టార్గెట్ రీచ్ అయింది. నీలాక్షిక సిల్వా (33 బంతుల్లో 56; 5 ఫోర్లు, 3 సిక్సర్లు), హర్షిత సమరవిక్రమ (61 బంతుల్లో 53; 5 ఫోర్లు) లంకను గెలిపించారు. భారత బౌలర్లలో స్నేహ్ రాణా మూడు వికెట్లు తీసింది.

టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత్ కు మంచి ఆరంభమే దక్కింది. ప్రతీకా రావల్ (35), స్మృతి మంధాన (18) ఫస్ట్ వికెట్ కు 51 రన్స్ జోడించారు. కానీ మంధాన రనౌట్ కాగా.. ప్రతీక కూడా ఆ కాసేపటికే ఔటైంది. ...