భారతదేశం, ఆగస్టు 8 -- అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత్‌పై సుంకాలు ప్రకటించిన తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతింటున్నాయి. గురువారం 50 శాతం సుంకం ప్రకటించిన తర్వాత, ట్రంప్ వాణిజ్య సలహాదారు పీటర్ నవరో భారతదేశ వాణిజ్య విధానాలను విమర్శించారు. 'సుంకాల రారాజు'గా అభివర్ణించారు. అంతే కాదు చైనాపై సుంకాల మీద కూడా నవరో సమాధానమిచ్చారు. ఇప్పటికే చైనాపై ఎన్నో సుంకాలు విధించామని చెప్పారు.

'ప్రపంచంలో టారిఫ్‌ల రారాజు భారత్. అత్యధిక టారిఫ్ వసూలు చేస్తారు. ఈ కారణంగా అమెరికన్ వస్తువులు చాలా ఖరీదైనవి, దీని వల్ల మేం మార్కెట్లో మనుగడ సాగించలేకపోతున్నాం. ఈ విధంగా భారత్ కు ఏటా బిలియన్ డాలర్లు పంపుతున్నాం.' అని నవరో అన్నారు.

ట్రంప్ సలహాదారు నవరో అక్కడితో ఆగలేదు, భారతదేశంతో వాణిజ్యంలో భారతదేశం మిగులును రష్యా, ఉక్రెయిన్ యుద్ధంతో ముడిపెట్టారు. భారత్ తమత...